Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 16:42:41
facebook Twitter Googleplus
Photo

మామూలుగా హీరోయిన్ భావన పెళ్లి గురించి జనాలకు పెద్ద పట్టింపే ఉండేది కాదు. మలయాళ ప్రేక్షకులు కూడా ఆ సంగతి గురించి పెద్దగా చర్చించుకునే వాళ్లు కాదేమో. కానీ మూడు నెలల కిందట జరిగిన కిడ్నాప్ వ్యవహారం నాటి నుంచి భావనకు సంబంధించిన ప్రతి విషయం వార్తాంశమే. కిడ్నాప్ ఘటన నుంచి త్వరగానే కోలుకుని నిర్మాత నవీన్ తో నిశ్చితార్థం చేసుకున్న భావన.. పెళ్లికి కూడా ముహూర్తం చూసుకుంది.

ఈ ఏడాది అక్టోబరులోనే భావన-నవీన్ పెళ్లి జరగనుంది. కన్నడ పరిశ్రమకు చెందిన నవీన్ తో భావన గత ఏడాది నుంచి ప్రేమలో ఉంది. అతడితో పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలోనే భావనకు చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆ ఘటన వాళ్లిద్దరి బంధంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. పెళ్లి కూడా అలాగే చేసుకోవాలనుకుంటోంది. అక్టోబరు 27న భావన పెళ్లి జరుగుతుందని.. తమ స్వస్థలమైన తిరుచ్చూరులో పెళ్లి జరిపించాలని నిర్ణయించామని భావన తల్లి పుష్ప వెల్లడించింది. తిరుచ్చూరులోని లులు కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేడుక జరగనుంది.

ఈ వివాహ వేడుకకు కొద్ది మంది సినీ ప్రముఖులు బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. భావన చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగడం సందేహమే. కాగా భావన కిడ్నాప్.. లైంగిక వేధింపై కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇందులో పెద్దల ప్రమేయం ఉందని అనుమానిస్తుండగా.. ఎవరి పేర్లూ బయటికి రాలేదు.

,  ,  ,  ,