Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 11:41:56
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోయిన్స్ గా కనిపించిన కొంత మంది సౌత్ భామలు ఇప్పుడు ప్రత్యేక పాత్రల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యువ హీరోలకి అత్తగా - అమ్మగా కనిపిస్తూ.. ప్రేక్షకుల మదిలో కొత్త తరహా గుర్తింపు కోసం పరితపిస్తున్నారు. అలాంటి నటీమణులు ఇప్పుడీ అన్ని ఇండస్ట్రీలలో ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం అందరి చూపు ఒక సీనియర్ హీరోయిన్ వైపు మళ్లింది.

న్యాచురల్ స్టార్ నాని ఎంసీఏ సినిమాలో భూమిక వదిన పాత్రలో కనిపించబోతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమని ట్రైలర్ లొనే చూపించేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు ఇంకా మెగాస్టార్ - నాగార్జున వంటి స్టార్ హీరోస్ తో అమ్మడు అప్పట్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఖుషి సినిమాలో భూమిక చేసిన పాత్రను ఎవరు మరచిపోలేరు. ఇండస్ట్రీ హిట్స్ లలో అమ్మడు కనిపించింది. అయితే అంతటి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భూమిక సడన్ గా ఫేడవుట్ అయిపోయింది. కొన్నాళ్ళ గయాప్ తరువాత మళ్లీ కొత్తగా సహాయక పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని ఆశపడుతోంది.

అందుకు ఎంసీఏ లాంటి సినిమా ఆమెకు మంచి అవకాశం అని చెప్పవచ్చు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా భూమిక పాత్ర ఏ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయినా నెక్స్ట్ మంచి ఆఫర్స్ దక్కడం ఖాయం. ఈ రోజుల్లో సీనియర్ హీరోయిన్స్ కి వదినా - అత్త అమ్మ వంటి క్యారెక్టర్స్ కాకుండా స్పెషల్ రోల్స్ కూడా దక్కుతున్నాయి. కాకపోతే కాస్త కూడా ప్రమోట్ చేసుకోకుండా అమ్మడు అస్సలు మీడియా ముందుకు రాకుండా.. తన పాత్ర మాత్రమే మాట్టాడాలి అనుకోవడం కాస్త విడ్డూరంగా ఉంది.

,  ,  ,  ,  ,  ,