Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2017 11:35:40
facebook Twitter Googleplus
Photo

2001వ సంవత్సరం తెలుగు సినిమాలో ఒక చిన్న చిరు మార్పు వచ్చింది. అదే ఖుషీ. అవును పవన్ కల్యాణ్ సినిమా వచ్చింది అతని కెరియర్ మరో మెట్టు ఎక్కింది. ఇప్పుడు అతను కాదు మన కథ అదే సినిమాలో పవన్ సరసన నటించి అందరి యువకుల మనసులో మిగిలిపోయాన హీరోయిన్ భూమిక చావ్లా. ఆ తరువాత చాల హింది - తమిళ్ - తెలుగు హిట్ సినిమాలలో నటించి పెళ్ళిలైన తరవాత కొంత విరామంతో 2014 లో లడ్డు బాబు తో తిరిగి వచ్చింది. తల్లి కావడం వలన మళ్ళీ కొద్ది కాలం సినిమాకు దూరం అయ్యింది.

ఇప్పుడు నాని రాబోతున్న సినిమా MCA తో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది తెలుగులోకి. ఇదే కాకుండా చక్రి తోలేటి డైరెక్ట్ చేస్తున్న.. తమన్నా - ప్రభుదేవా నటిస్తున్న కొత్త సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది భూమిక. తన కొత్త సినిమా విశేషాలు గురించి తిరిగి ఆగమనం గురించి ఇలా అంటుంది నాకు నటించడం చాల ఇష్టం కానీ నటించడానికి నేను ఏమి తొందరపడటం లేదు. ఏది వస్తే అది కాకుండా కొంచెం మంచి పాత్రలు అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలి అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు 70 ఏళ్ళు వచ్చినా నటిస్తాను అని చెప్పింది. నేను వచ్చిన కొత్తలో ఉన్న సినిమాలుకు ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాలుకు చాల మార్పు చూశాను ఇప్పుడు ఆడవాల్లుకు మంచి పాత్రలే రాస్తున్నారు. బాలీవుడ్ లో ఈ మార్పు వచ్చింది ఇప్పుడు మన తెలుగు దగ్గర మొదలైంది అని చెప్పింది. ప్రేక్షకులు మారడం వలనే ఇది సాధ్యం అయ్యందంటోంది భూమిక.

ఈ మధ్యనే వచ్చిన ఎమ్ యెస్ ధోని సినిమాలో ధోని పాత్రకు అక్కగా నటించింది భూమిక.

,  ,  ,  ,  ,