Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 11:56:24
facebook Twitter Googleplus
Photo

గుండె జారి గల్లంతయ్యిందే?? నితిన్ కి ఓ ప్రత్యేకమైన సినిమా. అంతవరకూ ఉన్న పరాజయాల పరంపరకు ?ఇష్క్? విజయంతో కాస్త ఊపిరిపీల్చుకున్న నితిన్ కి ?గుండె జారి గల్లంతయ్యిందే? మంచి విజయం అందుకున్నాడు. 2013 లో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నితిన్ హీరో కాగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ లో ఒరిజనల్ లో ఉన్న కథానాయిక నిత్యామీనన్ కి కాక శ్రుతి హాసన్ ని ఎంపిక చేసినట్లు తెలిసింది. దాదాపు ?గుండె జారి గల్లంతయ్యిందే? కి పనిచేసిన సాంకేతిక బృందం ఈ సినిమాకు పనిచేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత కాగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ లో మెదలవబోతున్నట్లు సమాచారం.

,  ,  ,  ,  ,