Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 16:33:36
facebook Twitter Googleplus
Photo

పవన్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి, కంప్లీట్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో మూడు నాలుగు సినిమాలను షార్ట్ టైంలో పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలతో ఆర్ధికంగా సెటిలవ్వాలని పవన్ భావిస్తున్నట్టు టాక్.పవన్ త్వరలో ఎస్.జె సూర్యతో ఖుషీ సీక్వెల్‌ని చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఆ తరువాత త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని శరత్ మరార్ , హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీటి తర్వాత దాసరి నారాయణ రావు నిర్మాణంలో ఓ చిత్రాన్ని చేయనున్న పవన్, ఏ ఎమ్ రత్నం బ్యానర్‌లో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తుంది.
ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు మొదలైపోయాయట. ఇటీవలే ముంబయిలో సంగీత చర్చలు మొదలయ్యాయని తెలిసింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మొదటి పాట రికార్డింగ్ పూర్తైపోయింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ విషయమై అఫీషియల్ న్యూస్ రావచ్చు. ఈ చిత్రాన్ని సైతం ?సర్దార్‌?? నిర్మాత శరద్ మారార్ నిర్మించనున్నారు. ఈ మధ్యనే పవన్ ఈ విషయాన్ని సైతం ధృవీకరించారు. ఫ్యాక్షనిస్ట్ ప్రేమ కధగా రూపొందనున్న ఈ చిత్రానికి ?హుషారు? అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది

,  ,  ,  ,  ,  ,