Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Apr-2016 19:36:21
facebook Twitter Googleplus
Photo

విజ‌య్ ఆంటోనీ, స‌త్య‌టైటస్ జంట‌గా న‌టించిన పిచ్చైకార‌న్ చిత్రాన్ని తెలుగులోకి శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రా ప‌తాకంపై చ‌ద‌లవాడ ప‌ద్మావ‌తి బిచ్చ‌గాడు పేరున అనువ‌దించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఫిలిం ఛాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథిదిగా హాజ‌రైన జ‌య‌సుధ ఆడియాను విడుద‌ల చేసి తొలి ప్ర‌తిని విజ‌య్ ఆంటోనికి అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా జ‌య‌సుధ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైల‌ర్ చూశాక ఇది మంచి సందేశం ఉన్న సినిమా అనిపించింది. త‌మిళంలో రూపొందిన ఈ సినిమాను నేను చూడ‌లేదు .. మా అబ్బాయి చూసి ఇది చాలా మంచి సినిమా అని చెప్పాడు. ఇందులో త‌ల్లి సెంటిమెంట్ పాట నాకు చాలా బాగా న‌చ్చింది. ఇలాంటి సినిమాల‌ను త‌మిళ్ లో మాత్ర‌మే తీయ‌గ‌లరు తెలుగులో తీయ‌డానికి సాహసించ‌రు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోనీ సంగీత ద‌ర్శ‌కుడిగా తెలుసు. .. అత‌ను న‌టుడిగా కూడా మారి మంచి సినిమాలు చేస్తున్నాడు . .అత‌ను గ‌తంలో చేసిన సినిమాలు కూడా మంచి విజ‌యాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా అలాంటి విజ‌యాన్నే సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.
విజ‌య్ ఆంటోనీ మాట్లాడుతూ పిల్ల‌ల కొసం త‌ల్లి ఎన్నో చేస్తుంది. త‌ల్లి కోసం పిల్ల‌లు ఏమి చేశారు అన్న‌దే ఈ సినిమా ప్ర‌ధాన ఇతివృత్తం. త‌ల్లిని కాపాడుకునేందుకు మిలియ‌నీర్ అయిన కొడుకు ఏమి చేశాడు.. చావు బ‌తుకుల్లో ఉన్న త‌న త‌ల్లిని ఎలా ర‌క్షించుకున్నాడు అనేది చిత్ర ప్ర‌ధాన ఇతివృత్తం. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో .. చ‌క్క‌ని ఎంట‌ర్ టైన్ మెంట్ తో సినిమాను తీశాము..కొత్త‌ద‌నాన్ని కొరుకునే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.
ద‌ర్శ‌కుడు శ‌శి మాట్లాడుతూ గ‌తంలో నేను వెంక‌టేష్ తో శ్రీ‌ను అనే సినిమా తీశాను.. ఆ సినిమా త‌రువాత మ‌ళ్ళీ ఇన్నాళ్ళ‌కు నేను చేసిన సినిమా తెలుగులో విడుద‌ల అవుతోంది. ఒక వైవిద్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను అన్నారు.
చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ నేను గ‌తంలో ఏ సినిమా చూసి కూడా ఏడ‌వ‌లేదు .. ఈ సినిమా న‌న్ను కంట త‌డిపెట్టించింది. కొన్ని దృశ్యాలు నా మ‌న‌సును క‌దిలించాయి. ర‌జ‌నీ కాంత్ , క‌మ‌ల్ హాస‌న్ లు ఇద్ద‌రు క‌లిసి ఒకే పాత్ర పోషిస్తే ఎటువంటి న‌ట‌న వ‌స్తుందో ఆ త‌ర‌హాలో విజ‌య్ న‌టించాడు. ఈ సినిమా పై వ‌చ్చిన మొత్తాన్ని మినీ థియేట‌ర్స్ కోసం నా వంతు స‌హాయంగా అందిస్తాను అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అల్లాణి శ్రీ‌ధ‌ర్, ప్ర‌స‌న్న కుమార్‌, మాతృదేవోభ‌వ ద‌ర్శ‌కుడు కె. అజ‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు

,  ,  ,  ,  ,  ,