Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 10:28:59
facebook Twitter Googleplus
Photo

అనుకోనిదేదో జరిగిపోవడం అంటే ఇలాగే ఉంటుంది. బిచ్చగాడు తెలుగు రాష్ట్రాల్లో ఆడేస్తుందని అందులో నటించిన హీరో విజయ్ ఆంటోనీ కానీ.. డబ్బింగ్ రైట్స్ కొనుక్కుని రిలీజ్ చేసిన నిర్మాతలు కానీ అనుకుని ఉండరు. అసలు సమ్మర్ సీజన్ లో టాలీవుడ్ లో చిన్న సినిమాల విడుదలకు ఖాళీ కూడా లేదని అనుకుంటున్న టైంలో.. ఈ బిచ్చగాడు వచ్చేసి పిచ్చపిచ్చగా ఆడేస్తోంది.

మూవీలో కంటెంట్ కంటే సరైన టైంలో విడుదల చేయడం బిచ్చగాడికి బాగా అడ్వాంటేజ్ అయింది. దీనికి మించి ప్రమోషన్ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయింది. టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తుందని అనుకున్న బ్రహ్మోత్సవం బోల్తా కొట్టడం.. అన్నిటికంటే ఎక్కువగా బిచ్చగాడికే కలిసొచ్చింది. కారణాలు ఏవైనా.. 50 లక్షల నామమాత్రపు ఖర్చుతో విడుదలైన బిచ్చగాడు.. ఇంకా వసూళ్లు ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నాడు.

ఇప్పటికి తెలుగు రాష్ట్రాల నుంచి 13 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది బిచ్చగాడు. ఈ దెబ్బకి విజయ్ యాంటోనీ తన నెక్ట్స్ పిక్చర్స్ ని కూడా క్యూలో పెట్టేస్తున్నాడు. గతంలో తన హిట్ సినిమాలు అన్నింటినీ డబ్బింగ్ చేసేస్తున్నాడు థియేటర్లలో అ..ఆ.. మినహాయిస్తే నెక్ట్స్ ఆప్షన్ గా ఉండడంతో.. తెలుగు ఆడియన్స్ ఇంకా ఈ బిచ్చగాడిని బాగానే ఆదరిస్తున్నారు.

,  ,  ,  ,  ,