Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 14:57:46
facebook Twitter Googleplus
Photo

హిట్ టాక్ సొంతం చేసుకొందన్న మాటే కానీ... అఆ విషయంలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పాత సినిమా మీనాని దించేశారనీ... డైరెక్టర్ పరిమితికి మంచి ఖర్చు చేయించాడు కాబట్టి లాభాలు కూడా కష్టమే అని ఫిల్మ్ నగర్ జనాలు మాట్లాడుకొంటున్నారు. లాభాలు వస్తాయా? రావా? అనేది నిర్మాతకి సంబంధించిన విషయం కానీ... మీనాని కాపీ కొట్టారన్నన అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జీనియస్ అనిపించుకొంటున్న త్రివిక్రమ్ దగ్గర అప్పుడే కథలు అయిపోయాయా? మీనాని దించేయాల్సిన అవసరం ఆయనకి ఎందుకొచ్చింది? అని విమర్శిస్తున్నారు సినీ అభిమానులు.

అయితే చిత్రబృందంలోని కొద్దిమంది మాత్రం త్రివిక్రమ్ మీనాని కాపీ చేయలేదనీ ఆ నవల హక్కులు తీసుకొని మరీ చిత్రాన్ని తెరకెక్కించాడని అయితే ఆ విషయం ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు - స్క్రీన్ పై రచయిత యద్ధనపూడి సులోచనా రాణికి ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదనే విషయాలకి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ కారణాలేంటన్నది మాత్రం స్పష్టంగా బయటపెట్టడం లేదు. ఈ రోజు అఆ సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరపబోతున్నారు. మరి రాత్రి జరిగే ఈ వేడుకకి త్రివిక్రమ్ వస్తాడా? వస్తే మీనా రీమేక్ పై క్లారిటీ ఇస్తాడా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. సినిమా గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నా వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. యు.ఎస్.లో అయితే అఆ జోరుకి అడ్డే లేదు. అక్కడ రెండు మిలియన్ డాలర్లకి దగ్గర దగ్గరగా ఈ సినిమా వసూలు చేసే అవకాశాలున్నాయని మాట్లాడుకొంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

,  ,  ,  ,  ,  ,