దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బాలయ్యతో లెజెండ్.. అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేశాడు. ముఖ్యంగా బన్నీ సినిమాతో 76 కోట్ల షేర్ వసూళ్లను సాధించి.. ఇండస్ట్రీ టాప్5 లో చోటు సంపాదించాడు. నిజానికి ఇంత చేశాక.. బోయపాటి ఈ పాటికి స్టార్లతో సినిమాని సైన్ చేసేయాల్సిందే. దాసరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ మూవీ చేసే ఆఫర్ వచ్చిందని కూడా టాక్ ఉంది.
కానీ పవర్ స్టార్ సినిమాకి బోయపాటి నో చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం ఓ రివెంజ్ స్టోరీనే అంటున్నారు. మరీ బోయపాటి తీసే సినిమాల్లో కనిపించేంత రివెంజ్ కాదు కానీ.. కొరటాల కామెంట్స్ కు సమాధానం ఇచ్చేందుకే అని తెలుస్తోంది. రీసెంట్ గా జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ లో.. సింహ చిత్రానికి స్టోరీ-డైలాగ్స్ తనవే అని చెప్పాడు కొరటాల. ఏదో ఒకదానికే క్రెడిట్ ఇస్తానంటే వద్దన్నాడన్నది కొరటాల వెర్షన్. మరోవైపు స్టోరీల విషయంలో బోయపాటి వీక్ అనే టాక్ కూడా ఉంది. అందుకే తన నెక్ట్స్ పిక్చర్ కి.. స్టోరీ డైలాగ్స్ తనే రాసుకోవాలని నిర్ణయించాడట ఈ దర్శకుడు.
కానీ పవన్-దాసరి మూవీ విషయంలో స్టోర ఇప్పటికే సిద్దం అనే టాక్ ఉంది. వేరే రైటర్ రాసిన స్టోరీని డైరెక్ట్ చేయడం ఇష్టం లేకే.. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి బోయపాటి తప్పుకున్నాడట. బోయపాటి శ్రీను రియల్ రివెంజ్ స్టోరీ ఇదే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.