Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2016 10:45:42
facebook Twitter Googleplus
Photo

ఊర మాస్ తియ్యాలంటే బోయపాటి శ్రీనుని మించిన దర్శకుడు లేడన్నది ఇండస్ట్రీ జనాల ఒపీనియన్. ఈ విషయాన్ని సరైనోడు సక్సెస్ బోయపాటి ప్రూవ్ చేసేశాడు కూడా. డివైడ్ టాక్ వచ్చిన స్టైలిష్ స్టార్ సరైనోడు.. ఇండస్ట్రీ టాప్5 లోకి చేరిపోయిందంటే.. అందులో బోయపాటి టేకింగ్ పాత్ర చాలానే ఉంటుంది. ఈ దర్శకుడు ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాకి రెడీ అవుతుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఓ కథ రాస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్.. ఇండస్ట్రీ రికార్డుల్లో నమోదయ్యే సినిమాని ఇచ్చి జోష్ మీద ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ అంటే ఖచ్చితంగా క్రేజీ థింగ్ అనాల్సిందే. గతంలో బోయపాటి-ఎన్టీఆర్ లు కలిసి దమ్ము చిత్రాన్ని చేశారు కానీ.. అది అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈసారి పక్కా స్టోరీ ఎన్టీఆర్ ని.. జూనియర్ అభిమానులను శాటిస్ఫై చేయాలని బోయపాటి అనుకుంటున్నాడట. జనతా గ్యారేజ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తారక్.. తన నెక్ట్స్ మూవీని ఏ దర్శకుడితో చేసినా.. ఆ తర్వాత సినిమా తానే చేయాలన్నది బోయపాటి ఆలోచనగా చెబుతున్నారు.

ఎన్టీఆర్ ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకుంటున్నాడు. వక్కంతం వంశీతో మూవీ ఫైనల్ చేయకపోవడంతో.. పూరీ జగన్నాథ్-అనిల్ రావిపూడి- లింగుస్వామి లైన్ లో ఉన్నారనే టాక్ ఉంది. ఒకవేళ ఇజంతో పూరీ సక్సెస్ మాత్రం.. బాల్ పూరీ కోర్టులోకే చేరే ఛాన్స్ ఉంది.

,  ,  ,  ,  ,