Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 15:54:00
facebook Twitter Googleplus
Photo

కెరీర్ పై ఇన్నాళ్లూ గందరగోళంలో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రిలాక్స్ అయిపోయే టైమ్ వచ్చింది. తొలి సినిమా అల్లుడు శీనుతో వివి వినాయక్ దర్శకత్వంలో సమంత తమన్నాల అండతో మంచి వసూళ్లు సాధించాడు ఈ హీరో. అయితే.. ఫైనల్ గా రిజల్ట్ చూసుకుంటే మాత్రం బోలెడంత నష్టమే మిగిలింది. మలి సినిమాను స్పీడున్నోడు అంటూ భీమినేని శ్రీనివాస్ తో ఓ రీమేక్ ట్రై చేసినా.. అది కూడా బెడిసి కొట్టింది. అప్పటికే బోయపాటి శ్రీనుతో ఓ సినిమాని ప్లాన్ చేసి ఉండడంతో.. ఆశలన్నీ ఆ డైరెక్టర్ పైనే పెట్టుకుని వెయిట్ చేశాడు.

ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నాళ్లుగానో ఎదురచూస్తున్న టైమ్ వచ్చేసింది. సరైనోడు సక్సెస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న బోయపాటి.. కుర్ర హీరోతో సినిమాకి ముహూర్తం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 20 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభంపై అనుమానాలు లేకపోయినా.. ఎప్పుడు మొదలవుతుందో తెలీక టెన్షన్ పడ్డ బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాడు.

సరైనోడులో స్టైలిష్ యంగ్ విలన్ గా మెప్పించిన ఆది పినిశెట్టిని.. బెల్లంకొండ సినిమాలో కూడా విలన్ గా చేసేందుకు ఒప్పించాడు బోయపాటి. ఈ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉండగా.. తొలిసారిగా ఓ లవ్ స్టోరీని డీల్ చేయనున్నాడు దర్శకుడు. అయినా సరే.. బోయపాటి మార్క్ యాక్షన్ కంటెంట్ సినిమా నిండా ఉంటుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,