Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2017 10:00:57
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు త్వరలో తెరంగేట్రం చేయబోయే వారసుల లిస్టులో.. మోక్షజ్ఞ పేరు మనకు పెద్దగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి.. నాగార్జున వంటి స్టార్ల వారసులు సినిమాల్లో హడావుడి చేస్తుండగా.. వెంకటేష్ వారసుడు ఇంకా చిన్నపిల్లాడు కాగా.. బాలయ్య కొడుకు ఒక్కడే డెబ్యూ చేసే ఏజ్ కు దగ్గరగా వచ్చాడు. అయితే మొన్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరువాత వెంటనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందనుకుంటే.. ఇప్పుడు రూటు మారిందట.

నిజానికి శాతకర్ణి సినిమాకు అసిస్టెంటు డైరక్టర్ గా పనిచేసిన మోక్షజ్ఞ.. తరువాత వెంటనే ఒక లవ్ స్టోరీ తో ఆరంగేట్రం చేస్తాడని అప్పట్లో రూమర్లు వచ్చాయి. తరువాత మాత్రం మనోడు బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఒక యాక్షన్ సినిమాతో వస్తున్నాడని అన్నారు. ఆ తరువాత మనోడు సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న రూమర్లు ఏంటంటే.. మోక్షజ్ఞకు యాక్టర్ కావాలనే ఇంట్రెస్ట్ లేదని.. మనోడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక మనోడి డెబ్యూ ఎప్పుడో చెప్పలేం కాని.. నటనలో ఆసక్తి లేదు అనే టాక్ మాత్రం అవాస్తవం అనే అనుకోవాలి.

ఎందుకంటే ఆల్రెడీ ముంబయ్ లోని ఒక ప్రముఖ ఫిలిం ఇనిస్టిస్యూట్ లో మోక్షజ్ఞ ఆల్రెడీ యాక్టింగ్ అండ్ ఫైటింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత లాస్ ఏంజెలిస్ వెళ్ళి అక్కడ కూడా ఒక సంవత్సరం శిక్షణ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. బహుశా అమెరికా వెళ్తున్నాడు అనగానే.. అక్క బ్రహ్మణి.. బావ లోకేష్ తరహాలో MBA కోసం వెళ్తున్నాడని రూమర్ రాయుళ్లు అనుకుంటున్నారేమో

,  ,  ,  ,  ,