Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 12:31:21
facebook Twitter Googleplus
Photo

హీరోలకు ఫ్రెండ్ గా చేసిన వ్యక్తి.. యంగ్ హీరోలకు సహజంగా అయితే బాబాయ్ గానో.. అంకుల్ గానో కనిపిస్తాడని అనుకుంటాం. సహజంగా సినిమా లెక్కలు ఇలాగే ఉంటాయ్. కానీ ట్యాలెంటెడ్ యాక్టర్ బ్రహ్మాజీ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. ఇండస్ట్రీలో అందరితోనూ మాంచి ఫ్రెండ్లీగా ఉంటాడని.. మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడని బ్రహ్మాజీకి మంచి పేరుంది. సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

ప్రస్తుతం చాలా సినిమాల్లో బ్రహ్మాజీ హీరో ఫ్రెండ్ రోల్ లో కనిపించేస్తున్నాడు. ఆది నటించిన నెక్ట్స్ నువ్వే చిత్రం వచ్చే నెల విడుదల కానుండగా.. ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు బ్రహ్మాజీ. ఈ సినిమా ఓ హోటల్ బేస్డ్ గా సాగుతుందని.. తన పాత్ర బోలెడంత హాస్యం పంచుతుందని చెప్పాడు బ్రహ్మాజీ. అలాగే తన లైఫ్ లో తొలిసారిగా హారర్ కామెడీ చేస్తున్న సంగతి కూడా చెప్పాడు ఈ యాక్టర్. రీసెంట్ గా నాని మూవీ కృష్ణార్జున యుద్ధం కోసం ప్రేగ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఇందులో నాని స్నేహితుని పాత్రలో బ్రహ్మాజీ కనిపించనుండగా.. నిఖిల్ నటిస్తున్న సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ రోల్ లోనే యాక్ట్ చేస్తుండడం విశేషం.

అసలు హైలైట్ ఏంటంటే.. గతంలో చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్ లకు కూడా ఫ్రెండ్ పాత్రలో బ్రహ్మాజీ నటించాడు. ఆ తర్వాత మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన కూడా అదే టైపు రోల్స్ చేసి.. ఇప్పటి యంగ్ స్టర్స్ కూ స్నేహితుని గానే ఉండడం హైలైట్.

,  ,  ,  ,  ,