Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2016 12:46:07
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ నెల 8న విడుదలవుతోంది. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సర్దార్ పై.. ఇండస్ట్రీలో చాలానే అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తూ.. పాత రికార్డులన్నిటినీ పవన్ దులిపేస్తాడని ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు సర్దార్ పై ఆశలు పెట్టుకున్నాడు ఓ స్టార్ కమెడియన్. హాస్యబ్రహ్మ అనిపించుకున్న బ్రహ్మానందంకు సర్దార్ గబ్బర్ సింగ్ చాలా కీలకంగా మారిపోయింది.

గత కొన్నేళ్లుగా బ్రహ్మీ టైం ఏ మాత్రం బాలేదు. గుర్తుపెట్టుకోదగ్గ ఒక్క కేరక్టర్ కూడా పడలేదు. గతంలో బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని సూపర్ హిట్లు కొట్టేసిన స్టార్లు కూడా ఉన్నారు ఇఫ్పుడు పరిస్థితి తారుమారైపోయింది. బ్రహ్మీకి ఓ బ్రహ్మాండమైన రోల్ కావాల్సి ఉంది. ఆ లోటును సర్దార్ తీర్చేట్లుగానే కనిపిస్తున్నాడు. ఈ మూవీలో తుపాకుల డీలర్ పాత్ర వెపన్ టైగర్ గా నటిస్తున్నాడు బ్రహ్మానందం. ఇఫ్పటికే బ్రహ్మీ గెటప్ కి.. ట్రైలర్ లో వినిపిస్తున్న డైలాగ్స్ కి మంచి టాక్ వచ్చింది.

సినిమాలో కూడా పవన్-బ్రహ్మీల కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయని అంటున్నారు. గబ్బర్ సింగ్ లో కూడా బ్రహ్మానందం చేసిన లోన్ రికవరీ బ్యాంక్ ఆఫీసర్ పాత్ర బాగా క్లిక్ అయింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా వెపన్ టైగర్ అంతకుమంిచిని కామెడీ పండించడం ఖాయం అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,