Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:27:58
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం అన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశ పరిచింది. తొలిరోజే విపరీతమైన నెగిటివ్ టాక్ కారణంగా.. కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. కంటెంట్ ఏమీ లేకపోవడం చెప్పిన చిన్న విషయంపైనా క్లారిటీ - కంటిన్యుటీ మిస్ కావడంతో.. ఆడియన్స్ తిప్పికొట్టారు. విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబుకి స్ట్రాంగ్ జోన్ అయిన.. యూఎస్ లోనూ ఈ చిత్రానికి కలెక్షన్స్ భారీగా లేకపోవడం.

మహేష్ మూవీస్ అంటే ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఫ్లాప్ సినిమాలను కూడా మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేర్చగల స్టామినా ఉన్న ఏకైక హీరో. కానీ భారీ అంచనాలను అందుకోవడం బ్రహ్మోత్సవం పూర్తిగా ఫెయిల్ అయింది. చివరకు యూఎస్ ఏలో వేసిన ప్రీమియర్లలో కూడా ఒక రికార్డు కూడా బద్దలవలేదు. కనీసం తన సొంత రికార్డు శ్రీమంతుడును కూడా బ్రహ్మోత్సవంతో బ్రేక్ చేయలేకపోయాడు మహేష్.

యూఎస్ ఏ ప్రీమియర్లలో బ్రహ్మోత్సవం 5.57లక్షల డాలర్లు వసూలు చేసి నాలుగో ప్లేస్ కి పరిమితం అయింది. మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో బాహుబలి అందనంత ఎత్తులో ఉండగా.. రీసెంట్ గా వచ్చిన పవన్ మూవీ సర్దార్ 6.15 లక్షల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మహేష్ శ్రీమంతుడు 5.60లక్షల డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవం నాలుగో ప్లేస్ కి పరిమితమైంది. తొలిరోజు కలెక్షన్స్ కూడా 2.50 లక్షల డాలర్ల లోపే ఉండే అవకాశం ఉంది.

,  ,  ,  ,  ,