Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 11:03:11
facebook Twitter Googleplus
Photo

లేడీ సూపర్ స్టార్ అనిపించుకోవాలని త్రిష తెగ ప్రయత్నిస్తోందంటూ ఆ మధ్య న్యూస్ వచ్చింది. ఆమె అనుకోవడం సంగతేమో కానీ.. అక్కడి నుంచి త్రిష చేస్తున్న రోల్స్ అన్నీ ఓ రేంజ్ లోనే ఉంటున్నాయి. సక్సెస్ సంగతి పక్కన పెడితే.. నాయకి అంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేసింది. అరణ్మణై2(తెలుగులో కళావతి) అంటూ ఆ తర్వాత కూడా దెయ్యం సినిమానే చేసింది.

ఇప్పుడు తెరకెక్కుతున్న మోహిని కూడా ఇదే బాపతు. ఇవి కాకుండా ధనుష్ తో కోడిలో నటిస్తుండగా.. అందులో పొలిటికల్ లీడర్ రోల్ కనిపించనుంది. ఇక చదురంగవేట్టై2లో అరవింద్ స్వామికి జోడీగా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించనుంది. బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ కి కూడా ఆప్షన్ ఈ చెన్నై చిన్నదే. మరో బాలీవుడ్ మూవీ ఎన్ హెచ్ 10ని తమిళ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. దానికి సెట్ చేసిన టైటిల్ ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.

తమిళ్ ఎన్ హెచ్ 10 కి 'గర్జనై' అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. ఇది రజినీకాంత్ కు సూపర్ స్టార్ ట్యాగ్ రాక మునుపు నటించిన సినిమా టైటిల్. 1981లో గర్జనై అనే పేరుతో ఓ సినిమా చేశారు రజినీ. ఇప్పుడా టైటిల్ ని.. లేడీ అమితాబ్.. లేడీ సూపర్ స్టార్ అనిపించేసుకోవాలని ఆశిస్తున్న త్రిష సినిమాకి పెట్టడం యాదృచ్ఛికమే లెండి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్.

,  ,  ,  ,  ,  ,