Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 11:02:30
facebook Twitter Googleplus
Photo

కాస్త లేటుగా వచ్చినా కూడా గట్టిగానే కొడతానంటున్నాడు రామ్ చరణ్. మొన్నామధ్యన ''బ్రూస్ లీ'' ఇచ్చిన పంచ్ కు.. చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు ''ధృవ'' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంత గ్యాప్ ఎందుకంటే ఈ సినిమాలో తాను పోషించే రోల్ కోసం మౌల్డ్ అవ్వడానికే.

అదిగో నిన్న గచ్చిబౌలి లో షూటింగ్ జరుగుతుంటే.. కొందరు మనోడితో స్నాప్స్ దిగారు. అక్కడ మెగా పవర్ స్టార్ లుక్ చూడండి ఓసారి. నున్నగా షేవింగ్ చేసి.. మందంగా హ్యాండిల్ బార్ లా మీసం పెంచి.. ఐ.పి.ఎస్ ఆఫీసర్లు నిజజీవితంలో ఎలా ఉంటారో అదే విధంగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా రగ్గడ్ లుక్ తోనే దర్శనం ఇచ్చిన చరణ్.. ఈ సినిమాలో మాత్రం ఇలా డిఫరెంట్ గా కనిపించడం చాలా ఆసక్తికరంగానే ఉంది. ఫ్యాన్స్ అయితే.. చరణ్ లుక్ మామూలుగా లేదబ్బా అంటున్నారు.

సురేందర్ రెడ్డి డైరక్షన్లో రూపొందుతున్న ''ధృవ'' సినిమా.. తమిళ చిత్రం తని ఒరువన్ ఆధారంగా రూపొందుతోంది. ఈ ఏడాది తమిళంలో తని ఒరువన్ సినిమా ఏకంగా 5 నామినేషన్లు సాధించిందంటే.. ఆ సినిమాలోని కంటెంట్ పవర్ ఏంటో అర్దమవుతోంది. చూద్దాం మరి చరణ్ ఏం చేస్తాడో!!

,  ,  ,  ,  ,  ,  ,  ,