Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2017 10:18:47
facebook Twitter Googleplus
Photo

ప్రకాష్ రాజ్ తన నటనతో అన్ని ఇండస్ట్రీలను ఆకట్టుకున్నాడు. అన్ని రకాల పాత్రలతో మెప్పించేయగలడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రకాష్ రాజ్.. ఆ తర్వాత విభిన్న రంగాల్లోకి ప్రవేశించాడు. సినిమా నిర్మాణం.. దర్శకత్వం లాంటివి కూడా ఈయనకు కొట్టిన పిండి అయిపోయాయి.

అలాగే సామాజిక సేవ.. స్వచ్ఛంద సేవ వంటి వాటిలో కూడా ప్రకాష్ రాజ్ హ్యాండ్ ఉంటుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ అనే పేరు మీద ఓ ఛారిటీ సంస్థ ఉంది. దీని కింద పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా మరో ప్రాజెక్టును ప్రారంభించాడు ప్రకాష్ రాజ్. సేవ్ వైల్డ్ లైఫ్ అంటూ.. అడవులను.. వన్య మృగాలను కాపాడేందుకు నడుం బిగించాడు. దీనికి ప్రచార కర్తగా కూడా తానే వ్యవహరించనుండగా.. ఇందుకు కర్నాటక ప్రభుత్వం మద్దతు అందిస్తోంది.

ప్రధానంగా కర్నాటక అడవులను కాపాడేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించగా.. తాజాగా దీన్ని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులతో కలిసి ప్రారంభించాడు ప్రకాష్ రాజ్.

,  ,  ,  ,  ,