Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 12:27:14
facebook Twitter Googleplus
Photo

సరైనోడు మూవీలో టైటిల్ సాంగ్ ఎంతగా క్లిక్ అయిందనే సంగతి తెలిసిందే. ఈ పాటను బాలీవుడ్ సింగర్ బ్రిజేష్ శాండిల్య పాడాడు. ఇప్పుడీ సింగర్ కు మహేష్ బాబు సినిమాలో బాడే అవకాశం లభించడం విశేషం. రీసెంట్ తాను మహేష్ కోసం పాడినట్లు బ్రిజేష్ కన్ఫాం చేశాడు కూడా.

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న మూవీ స్పైడర్. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా.. ప్రస్తుతం ఈ మూవీ కోసం ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్ట్ లో ఈ పాటను పిక్చరైజ్ చేయనుండగా.. ఇప్పుడు ఆ ఫాస్ట్ బీట్ సాంగ్ ను రికార్డ్ చేశాడట హారిస్ జైరాజ్. ఇది ఓ మంచి బీట్ తో సాగే పాట. గతంలో నేను ఇలాంటి బీట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. అలాగే మహేష్ బాబు సినిా కోసం పాడడం కూడా నాకు ఇదే మొదటిసారి. వాయిస్.. అందులో వినిపించే హెచ్చుతగ్గులు.. ఈ బాటలో చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నాడు బ్రిజేష్ శాడిల్య.

ఈ పాట రికార్డింగ్ కోసం కొన్ని రోజులుగా హైద్రాబాద్ లోనే ఉంటున్నాడు ఈ సింగర్. బ్రిజేష్ శాండిల్యతో ఈ పాట పాడిస్తే బాగుంటుందని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి రికమెండ్ చేశాడట. దీంతో బ్రిజేష్ పాటలను పరిశీలించిన హారిస్ జైరాజ్.. పెద్దగా ఆలోచనలు పెట్టుకోకుండా.. ఈ పాటను పాడించినట్లు తెలుస్తోంది

,  ,  ,  ,