Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2015 17:16:21
facebook Twitter Googleplus
Photo

ఇకపోతే చెప్పినట్లే.. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ''బ్రూస్ లీ''.. మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ కమర్షియల్ డైరక్టర్ శ్రీను వైట్ల రూపొందిస్తున్న సినిమా ఇది. సో.. సాధారణంగానే సినిమా మీద చాలా హైప్ ఉంటుంది. మరి ఆ ఎక్స్ పెక్టేషన్ లను సినిమా రీచ్ అవుతుందా?

సెన్సార్ నుండి వినిపిస్తున్న మాటేంటంటే.. సినిమాను ఆద్యంతం ఎంటర్ టైన్ మెంట్.. రొమాన్స్.. సెంటిమెంట్స్.. ఫైట్లు.. యాక్షన్.. డైలాగులతో పరిగెత్తించాడట దర్శకుడు శ్రీను వైట్ల. అందుకే సినిమాకు పెద్దల పర్యవేక్షణలో చూడాల్సిందిగా యు/ఎ సర్టిఫికేట్ చేతిలో పెట్టారు. అంతేకాదు.. సినిమా రన్ టైమ్ కూడా.. ఎంతో స్లీక్ గా ఉందట. కేవలం 146 నిమిషాల రన్ టైముతో పేస్ అదిరిపోయింది అని చెబుతున్నారు. ఫస్టాఫ్లో కామెడీ.. రకుల్ తో రొమాన్స్. సాంగ్స్ బాగా ప్లస్సంట. సెకండాఫ్ లో యాక్షన్ - డైలాగులు - ట్విస్టులు సూపర్ అంటున్నారు సన్నిహితులు.

అక్టోబర్ 16న విడుదల కానుంది బ్రూస్ లీ.

,  ,  ,