Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2015 11:35:44
facebook Twitter Googleplus
Photo

ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. తాజాగా కేథరీన్ విషయంలోనూ అదే జరిగింది. త్రిష తప్పుకోవడం వల్ల కేథరీన్ కి కలిసొచ్చింది. శింబు హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో కథానాయికగా త్రిష ఎంపికవడం ... తర్వాత ఆమె హఠాత్తుగా ఆ ప్రాజక్టు నుంచి బయటకు వచ్చేయడం మనకు తెలిసిందే. తన మాజీ చెలికాడు వరుణ్ మణియన్ ఈ చిత్రానికి ఫైనాన్షియర్ కావడంతో, అతనితో ఏర్పడిన విభేదాల కారణంగా త్రిష ఆ సినిమా వదులుకుంది. దాంతో, ఈ పాత్రకు కేథరీన్ ను తాజాగా ఎంచుకున్నారు. రెండు రోజుల క్రితమే ఆడిషన్ నిర్వహించి ఆమెను దర్శకుడు ఫైనల్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. అలా ఓ మంచి ఆఫర్ కేథరీన్ వశమైంది.

,  ,  ,  ,  ,