ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. హిట్ కాంబినేషన్ లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి.ఇప్పుడు హీరోయిన్ కేథరిన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హీరో అల్లు అర్జున్, కేథరిన్ తో సెంటిమెంట్ యాంగిల్ లో కనెక్ట్ అయిపోయాడనిపిస్తుంది. బన్నీ ?ఇద్దరమ్మాయిలు? సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కేథరిన్. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడింది. మళ్ళీ సరైనోడులో బన్నీతో అడిపాడింది. ఈ సినిమా ఊరమాస్ హిట్ గా నిలించింది. ఇప్పుడే మళ్ళీ కేథరిన్ తోనే ప్రోసిడ్ అవుతున్నాడు బన్నీ.
బన్నీ ?హరీష్ శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేథరిన్ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇంకొ హీరోయిన్ కూడా చోటుంది. ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి బన్నీతో ?సెకండ్? హీరోయిన్ గా హ్యాట్రిక్ కొట్టేస్తుంది కేథరిన్.