Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 13:55:40
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్న సినిమా అర్జున్ రెడ్డి. గత గురువారం రాత్రి ప్రివ్యూ షోలు పడ్డప్పటి నుంచి ఇప్పటికి కూడా హైదరాబాద్ ట్విట్టర్ ట్రెండింగ్స్లో అర్జున్ రెడ్డి అనే పదమే టాప్ లో ఉందంటే.. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు. అడల్ట్ కంటెంట్.. బూతులు ఎక్కువ కావడం వల్ల కొన్ని విమర్శలు వ్యక్తమై ఉండొచ్చు. ఇలాంటి సినిమాలు పిల్లలు - యువతపై కొంత నెగెటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న మాట కూడా వాస్తవమే. ఐతే కంటెంట్ - టేకింగ్ - యాక్టింగ్.. ఇలా చాలా విషయాల్లో తెలుగు సినిమాకు అర్జున్ రెడ్డి ఎన్నో పాఠాలు నేర్పిందన్న మాట వాస్తవమే. మార్పు దిశగా ఈ సినిమా ఓ పెద్ద ముందడుగన్నదీ అంగీకరించాల్సిన విషయమే.

ఐతే తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్లే ఇలాంటి సినిమా వచ్చినపుడు.. ఇండస్ట్రీ నుంచి ఆశించిన రెస్పాన్స్.. ఎంకరేజ్మెంట్ అయితే కనిపించలేదు. టాలీవుడ్ సెలబ్రెటీలు ఈ సినిమా గురించి మొదట్లో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఈ సినిమాకు వచ్చిన హైప్.. టాక్ ప్రకారం సెలబ్రెటీలు చాలా త్వరగా సినిమా చూసేసి ఉండాలి. ఈ సినిమా గురించి స్పందించి ఉండాలి. కానీ అలా జరగలేదు. వీకెండ్ అయ్యేలోపు ఈ సినిమా గురించి స్పందించిన వాళ్లు చాలా తక్కువ. ఐతే ఇండస్ట్రీ మీద అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ ఎలాంటిదో.. ప్రేక్షకుల్లోకి ఈ సినిమా ఎంతగా వెళ్లిపోయిందో అర్థం చేసుకున్నాక టాలీవుడ్ బిగ్ సెలబ్రెటీల్లో ఒక్కొక్కరుగా ఈ సినిమా గురించి స్పందిస్తున్నారు. మంచు లక్ష్మి.. సమంత.. రానా దగ్గుబాటి.. క్రిష్.. రాజమౌళి.. నాగార్జున.. ఇలా ఒక్కొక్కరుగా అర్జున్ రెడ్డి గురించి స్పందించారు. ఈ సినిమా ప్రత్యేకతను గుర్తించారు. దానిపై ప్రశంసలు కురిపించారు. అర్జున్ రెడ్డి సక్సెస్ తమకు రుచించినా రుచించకపోయినా.. ఇది విస్మరించడానికి వీల్లేని సినిమా అనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,