Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 14:03:44
facebook Twitter Googleplus
Photo

మెగా' రూమర్ అందరినీ సర్పరైజ్ చేసింది. గతంలో ఎవడు సినిమాలో రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్ మెరిసినట్లు.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో మెగా పవర్ స్టార్ కూడా మెరవనున్నాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్ సెట్ చేయడం అంత ఈజీ కాదులే. ఎందుకంటే ఇద్దరి కమిట్మెంట్లు అలా ఉన్నాయ్. కాకపోతే నా పేరు సూర్య సినిమాలో చెర్రీ కనిపించడం రూమరే అనుకోవాల్సి వస్తోంది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

నిజానికి బన్నీ సినిమాలో చరణ్ మెరవడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇద్దరూ కూడా మెగా కజిన్సే కాబట్టి.. అక్కడ ఇమేజ్ చట్రం వంటివి అడ్డేం రావు. కాకపోతే ఇప్పుడు రంగస్థలం సినిమా కోసం పూర్తి స్థాయిలో జుట్టు మరియు గెడ్డం పెంచుకుని ఉన్నాడు చరణ్. అయితే నా పేరు సూర్య సినిమాలో చరణ్ చేయాల్సిన క్యామియో రోల్ ఒక మిలటరీ ఆఫీసర్ కు సంబంధించినది. మరి మిలటరీ అధికారి అంటే ఖచ్చితంగా చిన్న క్రాఫ్ వేయించుకోవాలి. అలా చేస్తే రంగస్థలం షూటింగ్ కు ఇబ్బంది అవుతుంది. అందుకే చరణ్ ఈ క్యామియోను చేయడేమో అంటున్నారు సన్నిహితులు.

ఒకవేళ నిజంగానే చరణ్ తో కనుక ఆ రోల్ చేయించాలి అని బన్నీ అనుకుంటే.. ఖచ్చితంగా దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టొచ్చు కాని.. బన్నీ కూడా అంతగా తన కజిన్ పై ప్రెజర్ పెట్టకూడదనే ఫీలవుతున్నాడట

,  ,  ,  ,  ,