Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 11:20:00
facebook Twitter Googleplus
Photo

తెలుగులో కూడా ధనుష్ కు పిచ్చ క్రేజ్ ఉంది. కోలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా ధనుష్ వెలిగిపోతున్నాడు. అయితే తాజాగా ధనుష్ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే అది సినిమా కలెక్షన్ల పరంగా వచ్చిన రికార్డు కాదు. ట్విటర్ లో 50 లక్షల ఫాలోవర్లున్న తొలి దక్షిణాది హీరోగా ధనుష్ రికార్డులకెక్కాడు.

ఈ సందర్భంగా ధనుష్కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్లో రకరకాల పోస్టర్లను పోస్ట్ చేశారు. ఆయన హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం ఘన విజయం సాధించిన సంగంతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా వీఐపీ 2 త్వరలో విడుదల కానుంది. ధనుష్ ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

సౌందర్య ధనుష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీఐపీలో నటించిన అమలాపాల్ నే ఈ చిత్ర కథానాయికగా ఎంపిక చేశారు.

,  ,  ,  ,  ,