Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Nov-2016 14:31:26
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి వచ్చే వారసులందరూ కూడా ముందు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తారు. అందుకోసం యాక్షన్ సినిమాలు చేస్తారు. అక్కినేని నాగచైతన్య కూడా అలాంటి ప్రయత్నాలు కొన్ని చేశాడు. కానీ అవేవీ సరైన ఫలితాన్నివ్వలేదు. అందులోనూ దడ.. ఆటోనగర్ సూర్య.. దోచేయ్ లాంటి సినిమాలు అతడికి చేదు అనుభవాల్ని మిగిల్చాయి. దీంతో తనదైన స్టయిల్లో మళ్లీ ?ప్రేమమ్? లాంటి రొమాంటిక్ మూవీ చేసి మాంచి హిట్టు కొట్టాడు చైతూ. ఐతే ?సాహసం శ్వాసగా సాగిపో? సినిమా తర్వాత మాత్రం తన ఇమేజ్ మారుతుందని.. ఇకపై తాను యాక్షన్ సినిమాలు చేసినా జనాలు ఆమోదిస్తారని అంటున్నాడు చైతూ.

??సాహసం శ్వాసగా సాగిపో.. సగం వరకు ఒకలా.. రెండో సగం ఇంకోలా ఉంటుంది. ప్రథమార్ధం ?ఏమాయ చేసావె? సినిమాకు కొనసాగింపులా ఉంటుంది. రెండో అర్ధం ?ఘర్షణ? సినిమాను తలపిస్తుంది. సెకండాఫ్ లో నన్ను చూశాక జనాల అభిప్రాయం మారుతుంది. ఇకపై నేను యాక్షన్ సినిమాలు చేసినా ఆమోదిస్తారు. ఈ సినిమా తర్వాత నా ఇమేజ్ మారిపోతుందని భావిస్తున్నా. గతంలో యాక్షన్ సినిమాలు చేసేంత మెచ్యూరిటీ నాకు లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్లను నేను సరిగా క్యారీ చేయలేకపోయాడు. ఇప్పుడు పరిణతి వచ్చింది. పైగా ?సాహసం శ్వాసగా సాగిపో?లో యాక్షన్ పార్ట్ చాలా బాగా వచ్చింది. భవిష్యత్తులో యాక్షన్ సినిమాలు తప్పకుండా చేస్తాను?? అని చైతూ చెప్పాడు.

,  ,  ,