Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 10:40:29
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగ చైతన్య- సమంతలు పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరి నిశ్చితార్ధం జరగగా.. ఇప్పటికే వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైపోయింది. అక్టోబర్ 4న చైతు-శామ్ ల పెళ్లి ఘనంగా జరగనుంది.

ప్రస్తుతం తమ తమ సినిమా ప్రాజెక్టులు.. ప్రొఫెషనల్ వర్క్స్ తో బిజీగా ఉన్న వీరిద్దరూ.. పెళ్లికి 15 రోజుల ముందే కంప్లీట్ గా ఫ్రీ అయిపోనున్నారట. మ్యారేజ్ తర్వాత చైతు-శామ్ ఇద్దరూ కలిసి లాంగ్ హాలీడే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం అమెరికా వెళుతున్న చై-శామ్.. 40 రోజుల పాటు అమెరికా అంతా చుట్టేసేలా ప్లాన్ చేసుకున్నారట. ఈ లోపుగానే తమ చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిర్విరామంగా పని చేసేస్తున్నారు చై శామ్. కృష్ణ అనే కొత్త దర్శకుడు తీస్తున్న యుద్ధం శరణం గచ్ఛామిని చైతు పూర్తి చేస్తుండగా.. రామ్ చరణ్ తో రంగస్థలం 1985.. సావిత్రి బయోపిక్ మహానటిలలో నటిస్తోంది శామ్.

వీటిని పూర్తి చేసి పెళ్లికి సిద్ధమవుతున్న ఈ జంట.. మళ్లీ నవంబర్ నెల చివరలోనే షూటింగ్ స్పాట్ కు అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,