Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2016 11:45:15
facebook Twitter Googleplus
Photo

ఒక్కసారి అలా వినగానే సూపర్బ్ అనిపించే పాటలు కొన్నే ఉంటాయి. తన ప్రతి పాటా అలాంటి ఫీలింగ్ కలిగించాలని ప్రయత్నించే సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఒకడు. రెండు దశాబ్దాలకు పైగా సంగీత ప్రయాణం సాగిస్తున్న ఈ మ్యూజికల్ మెజీషియన్.. ఇప్పటికీ తన ప్రత్యేకత చాటుకుంటూ అత్యంత తాజాగా ఉండే పాటలు అందించడం విశేషమే. ఇవాళ విడుదలైన ?చకోరి? పాట వింటే రెహమాన్ ప్రత్యేకతేంటో మరోసారి తెలుస్తుంది. వారం రోజులుగా ?సాహసం శ్వాసగా సాగిపో? టీమ్ ఊరిస్తూ వస్తున్న ఈ ?చకోరి? పాటను ఈ రోజు లిరిక్స్ తో సహా గౌతమ్ మీనన్ ట్విట్టర్లో రిలీజ్ చేశాడు.

??పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి.. పోదాం ఈ దిక్కులూ ఆ చుక్కలూ దాటి.. పరువం రాదారి కాకాశం అయిందే.. పైపైకెళ్లాలన్నదే.. చకోరి చకోరి..?? అన్న పల్లవితో మొదలయ్యే ఈ పాట ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్యూన్ కానీ.. దీన్ని పాడిన తీరు కానీ సూపర్బ్ అనిపించక మానదు. వింటుంటే చాలా హాయిగా అనిపిస్తున్న పాట రిపీటెడ్ మోడ్ లోకి వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. చక్కటి తెలుగు లిరక్స్ తో పాట కూడా చాలా అందంగా రాశారు. సాహిత్యాన్ని మింగేయకుండా హాయిగా అనిపించే ట్యూన్.. గాయనీగాయకుల తీయని గొంతులు ?చకోరి? పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ పాట రిలీజ్ చేస్తూ ఆడియో జూన్ 17న అని కన్ఫమ్ చేశాడు గౌతమ్ మీనన్. ఐతే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. జులై 15న విడుదల అనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,