Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2017 12:57:42
facebook Twitter Googleplus
Photo

పూసర్ల వెంకట సింధు.. ఎనిమిది ఏళ్ల వయసులోనే నిర్ణయం తీసుకుంది.. తనకు ఏమి కావాలో దానికి ఏమి చేయాలో. అనుకున్న విధంగానే కఠోర దీక్షతో కొన్ని ఏళ్ళు తపించింది దాన్ని కోసం. చివరికి తన ప్రతిభ మరియు గురువు గోపి చంద్ సహకారంతో మొన్ననే రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించి తీసుకొచ్చి.. మన దేశం ఖ్యాతిని పెంచింది.

ఇప్పుడు మన దేశం సినిమాలో క్రీడలు పైకూడా కథలు రాసి సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. అమీర్ ఖాన్- దంగల్ వెంకటేష్ - గురు కమర్షియల్ సినిమాలైతే.. బాగ్ మిల్కా బాగ్.. మేరి కోమ్ సినిమాలు ఒరిజిన్ స్పోర్ట్స్ బయోపిక్స్. ఇక బ్యాడ్మింటన్ యువ సంచలనం తెలుగు తేజం సింధు జీవితం పై కూడా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాను హింది తెలుగు నటుడైన సోనూ సూద్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ కూడా హైదరాబాద్ రియల్ లొకేషన్లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనూ సూద్ మాటలాడుతూ సింధు కూడా ఈ ఫిల్మ్ లో భాగం అయితే నేను చాలా సంతోషిస్తాను. తను తప్పకుండ సినిమాలో ఒక కెమియో అయనా చేస్తారు. అది ఎలా ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ పని జరుగుతుంది. ఈ పాత్ర కోసం ఇంకా మేము లీడ్ గాళ్ అనేది డిసైడ్ కాలేదు అని చెప్పారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఆమెను తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,