Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2015 17:12:55
facebook Twitter Googleplus
Photo

చంద్ర మహేష్ గుర్తున్నాడా..? అగ్ర నిర్మాత రామానాయుడి బేనర్ లో ?ప్రేయసి రావె? లాంటి మంచి సినిమాతో పరిచయమైన దర్శకుడతను. తొలి సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు కానీ.. దాన్ని ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. రామానాయుడితో వేరే నిర్మాతలతో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశాడు కానీ.. చాలా వరకు ఫ్లాపులే ఎదురయ్యాయి. దీంతో చాలా కాలంగా మెగా ఫోన్ పక్కనబెట్టేసి వార్తల్లో లేకుండా పోయాడు చంద్రమహేష్. ఇప్పుడతను ఓ కొత్త సినిమాతో వస్తున్నాడు. అదే.. రెడ్ అలర్ట్.

ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలవుతున్నట్లు దానికి చంద్రమహేష్ దర్శకుడన్నట్లు చాలామందికి తెలియదు. ఐతే విడుదల ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా విశేషాల్ని పంచుకున్నాడు చంద్రమహేష్. ?రెడ్ అలర్ట్? ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా అని.. తాను తెలుగులోనే సినిమా తీద్దామనుకుంటే.. ఐతే కథ బాగా నచ్చడం వల్ల నిర్మాత శ్రీరాం రెడ్డి తమిళం - తెలుగు - మలయాళ భాషల్లోనూ తీద్దామని చెప్పారని.. అనుకున్నట్లే గత ఏడాది చివరికి నాలుగు భాషల్లో సినిమా పూర్తి చేశామని.. రిలీజ్ కు అంతా రెడీ అనుకుంటుండగా నిర్మాత హఠాత్తుగా చనిపోయాడని.. దీంతో సినిమా ఇంత ఆలస్యమైందని చంద్రమహేష్ చెప్పాడు. నిర్మాత కొడుకైన మహదేవ్ ఈ సినిమా హీరోల్లో ఒకడని.. టెర్రరిజం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశం ఇదని అన్నాడు.

,