Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 15:31:28
facebook Twitter Googleplus
Photo

ఎంతో కాలం నుంచి ఎదురుచూసిన చిరంజీవి 150వ సినిమా షూటింగ్ వెరీ రీసెంట్ గా స్టార్టయింది. అయితే ఇంతవరకు హీరోయిన్ సెలెక్షన్ కాలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ను తీసుకుందామని మెగా క్యాంప్ అనుకుంది. కానీ?దీపిక రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో ఆ ప్రపోజల్ ను డ్రాప్ చేసుకున్నారు.తరువాత మెగా క్యాంప్ అనుష్క అయితే కరెక్ట్ సెలెక్షన్ అనుకుందట. కానీ ఆ అమ్మడు ప్రస్తుతం బాహుబలి-2 , సింగం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అవి కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ ఫ్రెండ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ పై తీసే భాగమతి కి డేట్స్ ఇచ్చింది అనుష్క. మరి ఇంత బిజీ ఉన్న భామని ఒప్పించడం ఎలా అని కత్తిలాంటోడు నిర్మాత రామ్ చరణ్ .. తన ఫ్రెండ్ ప్రభాస్ ద్వారా భాగమతి నిర్మాతలను ఒప్పించి.. అనుష్క డేట్స్ ని అటు భాగమతికి, ఇటు కత్తిలాంటోడు కు సర్దుబాటు చేసేలా చూడమని అడగాలనుకుంటున్నట్టు ఒక టాక్ వచ్చింది. అలాగ అయితే చిరు సినిమాకు హీరోయిన్ ప్రాబ్లెం తీరినట్టే అని భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,