Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 14:22:26
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు సుకుమార్‍ తన మొదటి సినిమా ?ఆర్య? సినిమా నుంచీ ఓ వైవిధ్యమైన శైలితో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య ?నాన్నకు ప్రేమతో? అనే వైవిధ్యమైన కథతో హిట్ కొట్టిన సుకుమార్ తన తరువాత సినిమా రామ్ చరణ్ తో చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి మేము ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూనే ఉన్నాము.
నిజానికి మొదట వీరిద్దరి కాంబినేషన్లో ఓ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం వస్తుందని భావించినా చివరికి అది నిజం కాదని తేలింది. ఓ సరికొత్త అంశంతో సైన్స్ ఫిక్షన్ కథని సుకుమార్ రామ్ చరణ్ కి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు నాడు అయిన ఆగస్టు 22 న ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ?తని ఓరువన్? రీమేక్ సినిమాతో బిజీగా ఉన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,