Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 15:44:39
facebook Twitter Googleplus
Photo

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? తొలిసారిగా అమెరికాలో భారీ స్థాయిలో విడుదల అవుతున్నది. బాబీ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాని నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ మరియు ఈ రోస్ ఇంటర్ నేషనల్ తో కలిసి శరద్ మరార్ నిర్మిస్తున్నారు. ఐ డ్రీమ్ మీడియా మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ కలిసి మొదటిసారిగా 43 దేశాల్లో ఈ సినిమాని విడుదల చేస్తుండగా అందులో 23 దేశాల్లో మొదటిసారి విడుదల అవుతున్న తెలుగు సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కావడం విశేషం. ఒక్క అమెరికాలోనే విడుదలకు ముందు రోజు అయిన ఏప్రిల్ 7 న దాదాపు 350 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తుండగా ఇప్పటికే దాదాపు 15 ప్రీమియర్ షో లకి టికెట్లు అయిపోవడం గమనార్హం. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 7 న అమెరికాలో చాలా ప్రదేశాల్లో 5 నుంచి 10 స్పెషల్ షో లు వేస్తున్నారు. ప్రీమియర్ షో లు అన్నీ ఇప్పటికే ఫిక్స్ అయిపోగా డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు థియేటర్స్ కి చేరనున్నాయి.
కేవలం వారం క్రితం సర్దార్ గబ్బర్ సింగ్ టీం పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 8 విడుదల అవుతుందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ ?సర్దార్ గబ్బర్ సింగ్? రికార్డు సమయంలో షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధం అవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా శరద్ కేల్కర్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. రాయ్ లక్ష్మి, సంజన బ్రహ్మానందం, ముకేష్ రుషి, ఆలీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది రోజున ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

,  ,  ,  ,  ,