Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 12:18:59
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లు సీనియర్ అయిపోయాక ఏం చేయాలి?.. చాలామంది భామలకు ఇది చాలా పెద్ద క్వశ్చన్. కెరీర్ బాగున్నపుడు ప్లానింగ్ చేసుకోకపోవడం.. ఎల్లకాలం తాము హీరోయిన్లే అనుకుంటూ గడిపేయడంతో.. చాలామంది భామలకు కెరీర్ చివరి దశకు వచ్చాక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. కానీ పంజాబీ భామ ఛార్మీ కౌర్ ను చాలామంది చాలా నేర్చేసుకోవచ్చు.

హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తర్వాత కొందరు పెళ్ళిచేసుకుని తల్లులయ్యారు. మరి కొందరు ఎ..క్క..డ అంటూ వేరే రూటు వెతుక్కున్నారు. అంటే కనిపించకుండా మాయమైపోయారన్న మాట. టీవీషోలు సీరియల్స్ తో బిజీ అయ్యే ట్రెండ్ కూడా నడుస్తోంది. కానీ ఛార్మీ మాత్రం కొత్త రూట్ చూపించింది. ప్రస్తుతం పోర్చుగల్ లో బాలయ్య 101 కోసం.. ఛార్మి చక్కగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. కో డైరక్టర్ తరహాలో పూరి జగన్ కు అన్ని పనులూ చేసిపెడుతోంది. అలాగే పూరీ కనెక్ట్స్ అంటూ ట్యాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండనే ఉంది.

వీటన్నిటినీ చేస్తున్నందుకు ఎంచక్కా నెలకి ఇంత జీతం తీసుకుంటూ హ్యాపీగా జాబ్ చేసుకుంటోంది ఛార్మి. ఇప్పటికే జ్యోతిలక్ష్మిని నిర్మించిన అనుభవం కూడా ఉంది.

,  ,  ,  ,  ,