Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 11:02:00
facebook Twitter Googleplus
Photo

ఖచ్చితంగా ఇది మెగా ఫ్యాన్స్ కి మెగాన్యూసే. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని 150వ సినిమా ప్రకటన ఎప్పుడు చేస్తారా అని.. ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఆ శుభగడియ వచ్చేసింది. చిరు సినిమా ప్రారంభంపై ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డేట్ తో పాటు టైమ్ ను కూడా మెన్షన్ చేస్తూ.. చిరంజీవికి సంబందించిన పీఆర్ టీం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది.

ఏప్రిల్ 29వ తేదీ.. మధ్యాహ్నం 1.30ని. లకు.. చిరంజీవి 150వ సినిమా ప్రారంభానికి ముహూర్తం. అది కూడా వేరే ఏ సినిమానో కాదు. ఇప్పటివరకూ అనుకున్నట్లుగానే.. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ చేయనున్నారు. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. తెలుగు ఆడియన్స్ కి మెగా స్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్టోరీలో మార్పుచేర్పులు జరిగాయి. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా.. 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీలో స్పెషల్ లుక్ కోసం చిరు వర్కవుట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ 150వ చిత్రాన్ని.. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించనుండగా.. మెగాస్టార్ భార్య సురేఖ - చెన్నైకు చెందిన సినీ నిర్మాణ సంస్థ లైకా ఎంటర్టెయిన్మెంట్స్ లు.. సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు

,  ,  ,  ,  ,  ,  ,