Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 12:13:41
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ లో సీక్వెల్స్ మాట బాగానే వినిపిస్తోంది. ప్రేక్షకులను బాగా మెప్పించిన చిత్రాలకు సీక్వెల్ అంటే సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తిని బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునేందుకు వీలుగా వరసగా సీక్వెళ్లపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది ఇప్పటికే కమెండో - ఫక్రే - జాలీ ఎల్.ఎల్.బి. - హేట్ స్టోరీ - జుద్వా.. ఇలా పలు సీక్వెళ్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జూలీ -2 గోల్ మాల్ 4 మరికొద్ది రోజుల్లో రానున్నాయి. బాలీవుడ్ తో పోలిస్తే తెలుగులో సీక్వెళ్ల సంస్కృతి కాస్తంత తక్కువే.

బాలీవుడ్ ట్రెండ్ ను అనుసరిస్తూ తెలుగులో కూడా ఓ సీక్వెల్ వస్తోంది. దర్శకుడు ఓంకార్ తీసిన రాజుగారి గది పార్ట్ 2 రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ లో స్టార్ కాస్టింగ్ అస్సలు లేదు. కానీ సెకండ్ పార్ట్ లో నాగార్జున - సమంత లాంటి స్టార్లు నటించారు. బాలీవుడ్ తరహాలో రాజుగారి గది సిరీస్ ను కంటిన్యూ చేస్తానని అంటున్నాడు దర్శకుడు ఓంకార్. రాజుగారి గది-2 తప్పకుండా హిట్టవుతుందని... ఈ సినిమా తర్వాత పార్ట్ 3 తప్పకుండా తీస్తానని చెబుతున్నాడు. అయితే ఆ సినిమా కాన్సెప్ట్ - కాస్టింగ్ గురించి ఇప్పుడే మాట్లాడటం మరీ తొందరపాటు అవుతుందని అంటున్నాడు.

రాజుగారి గది-2 పేరుకు సీక్వెల్ అయినా దీనికి మొదటి సినిమా స్టోరీతో సంబంధం ఏమీ ఉండదు. ధూమ్ చిత్రాల తరహాలో కేవలం ఆ జోనర్ లో సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అక్కినేని వారింటి కోడలు సమంత తొలిసారి ఆత్మ పాత్రలో నటించింది.

,  ,  ,  ,  ,  ,