Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 10:31:30
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం రిలీజ్ కి సిద్ధమైపోయింది. జనవరి11న మూవీ రిలీజ్ అనే విషయం ఇప్పుడు అఫీషియల్. డేట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకూడదని ఫిక్స్ అయిన ప్రొడ్యూసర్ రామ్ చరణ్.. ఆ మాటకే కట్టుబడ్డాడు. తాజాగా రిలీజ్ డేట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూలకు సంబంధించి చెప్పుకొచ్చిన చరణ్.. నాన్న నటించే మరుసటి మూవీ కూడా తానే నిర్మించబోతున్నట్లు అనౌన్స్ చేసేశాడు.

151వ చిత్రానికి సంబంధించిన కథ.. దర్శకుడు ఫైనల్ కాగానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని.. ఆ ప్రాజెక్టును కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే నిర్మిస్తామని చెప్పాడు చరణ్. ఇప్పటివరకూ చిరు 151ని గీతా ఆర్ట్స్ పై నిర్మించనున్నారనే అంచనాలకు మెగాపవర్ స్టార్ ప్రకటనతో బ్రేక్ పడ్డట్లయింది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకరత్న దాసరి నారాయణ రావు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావులు చీఫ్ గెస్టులుగా ఆహ్వానించానన్న రామ్ చరణ్.. బాబాయ్ పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించబోతున్నట్లు చెప్పాడు.

కానీ రావడం రాకపోవడం అన్నది పూర్తిగా ఆయన ఇష్టమనేశాడు చెర్రీ. బాలకృష్ణ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణితో పోటీ అని తాను భావించడం లేదని.. సంక్రాంతికి రెండు సినిమాలు సక్సెస్ కాగలవన్న చరణ్.. బాలయ్య-క్రిష్ లకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.

,  ,  ,  ,  ,  ,