Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2014 10:33:59
facebook Twitter Googleplus
Photo

శంకర్ అద్భుత సృష్టిగా పేర్కొంటున్న 'ఐ' చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30 సాయంకాలం హైదరాబాదులో గ్రేండ్ గేలాగా దీనిని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం తెలుగు వెర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ రోజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆనాటి కార్యక్రమానికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ తారలు విచ్చేస్తారని తెలిపారు. గతంలో శంకర్ తీసిన అన్ని చిత్రాలలోకీ ఇది బ్యూటీఫుల్ గా, గ్రాండియర్ గా ఉంటుందని నిర్మాత చెప్పారు. ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం మరో హైలైట్ అవుతుందని అన్నారు. ఇందులో విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించారు. జనవరి 9న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లను రిలీజ్ చేస్తారు.

,  ,  ,  ,  ,  ,  ,