Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 11:56:07
facebook Twitter Googleplus
Photo

ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెళ్లి ఫుల్ బిజీ అయిపోయింది. సీరియల్.. సినిమాలు.. యాడ్ ఎండార్స్ మెంట్స్.. టీవీ షోస్.. మేగజైన్స్ కోసం ఫోటోషూట్స్.. అస్సలు గ్యాప్ లేకుండా దూసుకుపోతోంది పీసీ. ఇప్పుడు హాలీవుడ్ లో కొత్త పనులు ప్రారంభించేయబోతోందిట.

క్వాంటికో సిరీస్ 3వ సీజన్ కు షూటింగ్ లో ఉన్న పిగ్గీ ఛాప్స్.. ఏ కిడ్ లైక్ జేక్ అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ కూడా చేసేస్తోంది. ఆ వెంటనే ఈజింట్ ఇట్ రొమాంటిక్ లో కూడా నటించాల్సి ఉంది. ఇలా వరుస సినిమాలు చేస్తూనే.. ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ ను హాలీవుడ్ లో కూడా మొదలుపెట్టేయాలని ఫిక్స్ అయిందట. ఈమెకు పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై ప్రియాంక నిర్మాతగా ఇండియాలోని పలు భాషల్లో సినిమాలను తీస్తున్నారు. ఇదే బ్యానర్ ను ఇప్పుడు హాలీవుడ్ కు కూడా పట్టుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగున్నాయనే విషయాన్ని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కన్ఫాం చేసింది.

పర్పుల్ పెబుల్ బ్యానర్ పై మొదట బాలీవుడ్ సినిమానే తీయాలన్నది తన గట్టి పట్టుదల. ఈ ఏడాది చివరకు హాలీవుడ్ మూవీని స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. ట్యాలెంట్ ఉండి అవకాశం చిక్కని వారికి ఛాన్స్ ఇవ్వడమే ఈ బ్యానర్ ప్రధాన ఉద్దేశ్యం. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. కొత్త కథలకు ఆస్కారం ఇస్తున్నాయి.

,  ,  ,  ,  ,