Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 12:12:02
facebook Twitter Googleplus
Photo

మొన్న రామ్ చరణ్ బర్తడే సందర్భంలో కూడా అభిమానులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు గట్రా ఏర్పాటు చేసి.. మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తి రేకెత్తించారు. అయితే ఆ తరువాత జరిగిన శ్రీజ పెళ్లికి.. రిసెప్షన్ కు చాలామంది అభిమానులను పిలువలేదట. అందుకే అందరితోనూ మాట్లాడటానికి ఈరోజు మద్యాహ్నం చిరంజీవి అండ్ చరణ్ లు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడిన చిరంజీవి.. తన తదుపరి సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చారట. ''150వ సినిమా మొదలుపెట్టడమే లేటు. 'కత్తలాంటోడు' అనే టైటిల్ ను అనుకుంటున్నాం. తమిళ కత్తి రీమేక్ అయినా.. మనకు తగ్గట్లు చాలా యాడ్ చేయించా.. మీరందరూ ఎంజాయ్ చేస్తారు'' అంటూ సెలవిచ్చారట. ఆ దెబ్బకి అభిమానులు కేకలు పెట్టేశారంతే.

ఇకపోతే ఈ సినిమాను త్వరలోనే మొదలు పెడతాం అని చెప్పిన చిరు.. క్యాస్టింగ్ గురించి వేరే ఇతర విషయాల గురించి ఇంకా ఒక డెసిషన్ తీసుకోలేదని చెప్పేశారట.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,