Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Sep-2016 12:33:09
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కి గ్యాంగ్ లీడర్. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము దులిపేసిన చిరు.. తొలిసారిగా టీవీ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మాటీవీలో ప్రసారమయ్యే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ 4ను చిరు హోస్ట్ చేయబోతున్నారు. డిసెంబర్ లో దీని ప్రసారం ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ లోనే షూటింగ్ మొదలుపెట్టేస్తారని తెలుస్తోంది.

త్వరలో ఎంఈకే4 షూటింగ్ మొదలుపెట్టి.. ఈ నెలలో కొన్ని ఎపిసోడ్స్ ను.. అక్టోబర్ లో కొన్ని ఎపిసో్డ్స్ ను పిక్చరైజ్ చేయనున్నారట. అలాగే.. ఈ సీజన్ కి వచ్చిన రియాక్షన్ ను బట్టి.. మీలో ఎవరు కోటీశ్వరుడు 5కి కూడా మెగాస్టార్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించనుండనే సరికి... బోలెండత ఆసక్తి జెనరేట్ అవుతోంది.

పైగా డిసెంబర్ లోనే ఈ కార్యక్రమం ప్రసారం కానుండడం.. జనవరిలో చిరంజీవి150 సినిమా ఖైదీ నెంబర్ 150కి బాగా ప్లస్ అవుతుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే టైంలో.. మెగా 150 విడుదలకు ముందు ప్రసారం కానుండడం.. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ పై ఆడియన్స్-ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించేందుకు కారణం కానుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో కదా !

,  ,  ,  ,  ,