Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2017 10:43:24
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ తరువాత ఆ లెగసీని కంటిన్యూ చేసిన ఏకైక హీరో చిరంజవి. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ - కోలీవుడ్ అండ్ నేషనల్ సూపర్ స్టార్ రజనీకాంత్ ల తరువాత స్థానం చిరంజీవిదే. చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలినా... ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయినా కూడా కొంతవరకు సౌత్ కే పరిమితం అయ్యారు. కోర్ నార్త్ ఇండియా - ఈస్ట్ - నార్త్ ఈస్ట్ లో చిరు పెద్దగా చిరపరిచితుడు కారు. ఆయన కేంద్ర మంత్రి అయ్యాక కూడా పలు సందర్భాల్లో ఆయన ఇతర ప్రముఖులను కలిసినప్పుడు ఉత్తరాది మీడియా ఆయన్ను గుర్తించలేకపోయేది... ఎన్నో సందర్భాల్లో చిరు ప్రముఖులతో ఉన్నప్పుడు ఆ ప్రముఖులు అన్ నోన్ గెస్ట్ తో ఉన్నట్లే వార్తలు రావడమే దీనికి ఉదాహరణ. అంటే కోర్ నార్త్ ఇండియా మీడియా కూడా చిరును పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయింది. అయితే.. సౌత్ ఇండియాలో మాత్రం చిరు పేరు కానీ ముఖం కానీ తెలియనివారు లేరు. అలాంటి చిరంజీవి పదేళ్ల గ్యాప్ తరువాత తీసిన ఖైదీ నంబర్ 150 సినిమా మరోసారి చిరును సౌత్ లో మెగా స్టార్ ఇమేజిని అలాగే కంటిన్యూ చేయడానికి పూర్తిగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇంకా ఆయన్ని కొట్టే స్టార్ గానీ.. ఆయన రికార్డుల్ని తిరగరాసే మొనగాడు గానీ ఎవరూ రాలేదు. పదేళ్లుగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటే.. చిరు ఛరిష్మా తగ్గిపోయిందనుకున్నారు.. ఆయన వచ్చినా మునపటి రేంజ్ లో మ్యాజిక్ చేయలేరని ఎగతాళి చేసారు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసింది. చిరంజీవి సినిమాలను వదిలేసి పదేళ్లైంది.. మెగాస్టార్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నెంబర్ వన్ ఎవరు అని అడిగే అవసరమే రాలేదు. పాతికేళ్లుగా ఒకే హీరో టాలీవుడ్ ను ఏకచత్రాధిపత్యంగా ఏలేసాడు. మరో హీరో కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. అదీ మెగాస్టార్ స్టామినా.

రికార్డులైనా.. రివార్డులైనా.. అవార్డులైనా.. ఆల్ టైమ్ బాక్సులు బద్ధలు కొట్టాలన్నా.. అన్నీ చిరుకే సాధ్యం అని మరోసారి నిరూపించుకున్నాడు. 1983 నుంచి 2007 వరకు నెంబర్ వన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలేసాడు చిరంజీవి. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ నెంబర్ వన్ కుర్చీ కోసం పాకులాట నడుస్తూనే ఉంది కానీ ఎవరి సొంతం కాలేదు. పవన్ - మహేశ్ ముందున్నారు గానీ ఎవరూ ఆ చైర్ అందుకోలేదు. ఇలా నెంబర్ వన్ కోసం పోటీ నడుస్తుండగానే మళ్లీ మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేసారు. ఈ కుర్చీ నాదే.. అంటూ వచ్చీ రావడంతోనే సిగ్నల్స్ ఇచ్చేసారు చిరంజీవి. దీనికి ఖైదీ నెంబర్ 150 వసూళ్లే నిదర్శనం.

ఇప్పటి వరకు పవన్ - మహేశ్ - ఎన్టీఆర్ - ప్రభాస్ అంటూ ఎవరికి వాళ్లు రేసులో ఉన్నారు. కానీ పదేళ్ల తర్వాత వచ్చిన చిరు.. ఖైదీ నెంబర్ 150 తొలిరోజే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాడు. బాహుబలిని కూడా తలదన్ని హైయ్యస్ట్ డే వన్ రికార్డు సృష్టించాడు. తొలిరోజే ఖైదీ ఖాతాలోకి ఏపీ తెలంగాణల్లో కలిసి 24 కోట్లు వెళ్లాయి. ఇక ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్.. 8 రోజుల్లోనే 80 కోట్ల షేర్ వసూలు చేసాడు చిరంజీవి. రీమేక్ సినిమాతోనే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న చిరు.. డైరెక్ట్ సినిమాతో వచ్చి హిట్ కొట్టుంటే ఇంకా అదిరిపోయేదని అభిమానులు అంటున్నారు. బాలయ్య కూడా చిరుతో పోటీపడి సంక్రాంతికి గౌతమీ పుత్ర శాతకర్ణి రిలీజ్ చేసి సినిమాపరంగా మార్కులు కొట్టినా కలెక్షన్ల పరంగా చిరును చేరలేకపోయాడు. సో... రాజకీయాల్లో చిరుకు కోరుకున్న కుర్చీ దొరక్కపోయినా తెలుగు సినిమాల్లో మాత్రం ఆయన కుర్చీ ఇంకా పదిలంగానే ఉందన్నమాట.

,  ,  ,  ,  ,