Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 11:13:41
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం మిస్టర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఉన్నాయి. రెండు వరుస ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ద్వారా.. మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు శ్రీను వైట్ల. ఇప్పటివరకూ ఈ టీజర్ కు 1.6మిలియన్ వ్యూస్ వచ్చాయంటే.. జనాల్లో వైట్ల మూవీపై ఎంతటి ఆసక్తి ఉందో అర్ధమవుతుంది.

'నా కెరీర్ లోనే మిస్టర్ చాలా స్పెషల్ ఫిలిం. ఇప్పటివరకూ నేను అన్నీ ఎంటర్టెయిన్మెంట్ ఆధారంగానే సినిమాలు తీశాను. కానీ ఈ సినిమాలో మాత్రం నేను ఎమోషన్స్ ను ఎక్కువగా బేస్ చేసుకున్నాను. వీటికి మ్యూజిక్ ప్రాణం పోయనుంది. సంగీతం.. పాటలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నా' అంటున్నాడు శ్రీనువైట్ల. ఈ మూవీ సబ్జెక్ట్ కోసమే పలు దేశాలు.. ప్రాంతాలు చుట్టి రావాల్సి వచ్చిందన్నాడు ఈ దర్శకుడు.

స్పెయిన్.. స్విట్జర్లాండ్ లతో పాటు ఊటీ.. చిక్మంగళూరు.. హైద్రాబాద్ లలో షూటింగ్ చేయగా.. ప్రతీ ఫ్రేమ్ ఎంతో అందంగా ఉండేలా తెరకెక్కించారట. కేరళలోని అందమైన ప్రాంతాల్లో తుది షెడ్యూల్ పూర్తి చేస్తామంటున్న.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్ లు మిస్టర్ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,