Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2017 13:38:48
facebook Twitter Googleplus
Photo

మాస్ సినిమాలతో తెలుగు నేలపై హెవీ ఇమేజ్ తెచ్చుకుని.. మెగాస్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో చిరంజీవి. కరెక్టుగా పదేళ్ల కిందట ఆయన సినిమాలకు దూరమయ్యారు. 2007లో వచ్చిన ?శంకర్దాదా జిందాబాద్? తర్వాత సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత సంక్రాంతి కానుకగా వస్తున్న ?ఖైదీ నంబర్ 150? చిత్రంతో చిరంజీవి బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడులవుతున్న సందర్భంగా చిరంజీవి తన మనసులోని ఎన్నో సంగతులను పంచుకున్నారు.

నో ఫీలింగ్: 2007 తరువాత సినిమాలు చేయనప్పటికీ నేనేమీ పెద్దగా ఫీలవలేదు. నా చుట్టూ సిని మా వాతావరణమే ఉంది కాబట్టి పెద్దగా ఏమీ మిస్ అయినట్లు అనిపించలేదు. ఇక రాజకీయాలైనా సినిమాలైనా ఫలితం మన చేతుల్లో ఉండదు. రాజకీయాల్లో రాణించలేకపోయినా అభిమానులంతా ఎప్పుడూ నావెనకే నిలబడ్డారు.

నా రేంజిలో లేకే లేటు: సినిమాల్లోకి మళ్లీ రావాలని డిసైడైన రోజు నుంచే వరుసగా కథలు వింటూ వచ్చాను. అందులో కొన్ని బాగున్నా? కొన్ని మాత్రం నా రీఎంట్రీ రేంజికి తగ్గట్లుగా లేవు. అందుకే సరైన సినిమా ఎంచుకునేటప్పటికి లేటైంది.

రీమేక్ చేస్తే తప్పేంటి: విజయ్ నటించిన తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ?కత్తి? గురించి అప్పట్లో చాలా విన్నాను. ఆ సినిమా చూసిన వెంటనే ఇది 150వ సినిమాగా బాగుంటుందని అనిపించి వెంటనే ఆ దిశగా అడుగులేశాం. రీమేక్ చేయడం తప్పని నేను అనుకోను. ?కత్తి? సినిమా చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ?ఖైదీ నంబర్ 150? విషయానికొస్తే నా ఇమేజ్ కు తగ్గట్టు కామెడీ యాడ్ చేశాం.

రాంచరణ్ నా పర్సనల్ ట్రైనర్ అయిపోయాడు: సినిమాలో నా కొత్త లుక్ క్రెడిట్ అంతా రామ్ చరణ్ కే దక్కుతుంది. నాకు పర్సనల్ ట్రైనర్ గా మారి ఏం తినాలి.. ఏం తినకూడదు అని చరణ్ ఒక పర్ ఫెక్ట్ డైట్ ను సిద్ధం చేసేవాడు. ఎక్కువగా ప్రొటీన్ షేక్ తీసుకుంటూ డైట్ పాటించా.

ఇప్పటికీ బ్రేక్ డ్యాన్సర్ నే: తొమ్మిదేళ్ల తర్వాత ?ఖైదీ నంబర్ 150?లో మళ్లీ డ్యాన్స్ చేశాను. ఈ గ్యాప్ లో నేనెప్పుడూ బయట డాన్స్ ప్రాక్టీస్ చేసింది లేదు. నాలో డాన్స్ టాలెంట్ ఇప్పుడూ అలాగే ఉంది. సెట్ లో దేవి శ్రీ ప్రసాద్ బీట్ వినడం? కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసింది చేయడం.. స్టెప్పులే స్టెప్పులు.

వర్మతో గొడవ.. మనకు సంబంధం లేదు: రామ్ గోపాల్ వర్మతో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎలాంటి విభేదాలు లేవు. ఇక వర్మ విషయమై నాగబాబు చేసిన కామెంట్స్ అతని వ్యక్తిగత మన్న కోణంలోనే చూడాలి. నేనైతే ఎవరైనా కామెంట్ చేస్తే పెద్దగా పట్టించుకోను. నాగబాబు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తాను ఎలా ఫీలైంది చెప్పాడు. ఈ వివాదం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నా అభిమానులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోరని అనుకుంటున్నా.

అందరూ ఒక్కటే బాస్: గతంలో సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు ఒకేసారి వచ్చినా బాగా ఆడతాయని పలుసార్లు రుజువైంది. బాలకృష్ణ ?గౌతమిపుత్ర శాతకర్ణి?తో మా చిత్రానికి ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. హీరోలు కూడా మేమంతా ఒక్క టే అన్న సందేశాన్ని ఇవ్వాలి. ఇటీవల చరణ్ - మహేష్ కలిసి ఓ హాలీడే ట్రిప్ కు వెళ్లారు. అదేవిధంగా ఎన్టీఆర్ - అఖిల్ కూడా చరణ్ ను తరచు గా కలుస్తుంటారు. ఇవన్నీ చాలు నేటి హీరోలు ఎలా కలిసి ఉన్నారోనని చెప్పడానికి.

వెంకటేశ్ లా చేస్తా: మున్ముందు ప్రయోగాత్మక చిత్రాలు చేయాలి. భవిష్యత్తులో బయోపిక్స్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తా. వెంకటేష్ ?గురు?లో కొత్త తరహా పాత్ర చేస్తున్నాడు. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలే కానీ.. పెద్ద వయస్కుడిగా కనిపించే పాత్ర చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను.

,  ,  ,  ,  ,  ,  ,