Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jan-2017 12:38:56
facebook Twitter Googleplus
Photo

తండ్రితో నటించిన కథానాయికతో కొడుకు జోడీ కట్టడం గతంలో చూశాం. కానీ టాలీవుడ్లో తొలిసారిగా కొడుకుతో చేసిన హీరోయిన్ తో తండ్రి జత కట్టారు. ఆ జోడీ చిరంజీవి-కాజల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే తొలిసారి చిరు పక్కన కాజల్ నటిస్తోందనగానే జనాలకు అదోలా అనిపించింది. కొడుకుకు జంటగా నటించిన అమ్మాయితో తండ్రి జోడీ కట్టడం ఏంటనుకున్నారు. ఐతే ఈ ఫీలింగ్ చిరంజీవికి కూడా లేకపోలేదట. దాని వల్ల షూటింగ్ లో తాను ఇబ్బంది కూడా ఎదుర్కొన్నానని చిరు చెప్పడం విశేషం. తొలి రోజు కాజల్ తో షూటింగ్ సందర్భంగా తాను ఫ్రీగా ఉండలేకపోయానని చిరు చెప్పాడు.

ఫస్ట్ షాట్లో కాజల్ భుజం మీద తాను చెయ్యి వెయ్యాల్సి వచ్చిందని.. ఐతే ఆమె భుజానికి కొంచె పైన ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు చెయ్యి వేశానని.. తర్వాతి రోజు స్టిల్స్.. రష్ చూసి తన భార్య సురేఖ ఆశ్చర్యపోయిందని చిరు చెప్పాడు. ఏంటి చెయ్యి అలా పెట్టారని అడిగిందన్నాడు. ఫ్రీగా చెయ్యి వేద్దామంటే కాజల్ తో చరణ్.. బన్నీ నటించిన సంగతి గుర్తుకు వచ్చాయని చెప్పినట్లు చిరు వెల్లడించాడు. తాను ఎంత ఇబ్బంది పడ్డా కాజల్ చాలా కోపరేట్ చేసిందని.. తనతో చేసిన సీన్లలో తాను ఒక కొత్త నటుడిలా కనిపిస్తే.. కాజల్ మాత్రం అనుభవమున్న నటిలా చేసిందని చిరు అభిప్రాయపడ్డాడు. తాను.. కాజల్ మ్యాచ్ అవుతామా అన్న సందేహం తనలో మొదట్లో ఉండేదని.. తర్వాత అది పోయిందని చిరు చెప్పాడు.

,  ,  ,  ,