Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2017 11:29:33
facebook Twitter Googleplus
Photo

ఒకసారి ఇదే మాటను చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంగా తనే చెప్పానని కూడా అన్నారు. కాని ఆ మాటల ప్రభావం ఎంత ఉందో తెలియదు కాని.. ఇప్పుడు ఆయన మరోసారి అదే మాటను తన తమ్ముడికి చెప్పారట. పవర్ స్టార్ ను ఆ పని చేయొద్దంటూ వారిస్తున్నారట. అక్టోబర్ నుండి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు అన్ని చోట్లా ప్రకంపనలు రేపేసింది. దాని గురించి ఈ డిస్కషన్ అంతా.

అప్పట్లో పవన్ జనసేన పెట్టినప్పుడు.. అసలు ఏంటి ఇదంతా అని అడిగారట చిరంజీవి. ఇప్పుడే కదా వరుస హిట్లు వస్తున్నాయి.. చక్కగా సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అని హితబోధ చేశారు. ఆ విషయం ఆయన స్వయంగా ఒక మీడియా ఇంటర్యూలో కూడా చెప్పారు. ఆ తరువాత పవన్ నిజంగానే జనసేన విషయంలో కాస్త స్లో అయిపోయి.. వరుసగా సినిమాలను చేయడం మొదలెట్టేశాడు. అసలు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా అక్టోబర్ నుండి సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని చెప్పాడు. దానితో చిరంజీవి కలత చెంది.. రాజకీయాల్లో ఏదైనా చేసుకో కాని సినిమాలు మానొద్దు అని చెప్పారట.

పైగా తననే ఉదాహరణగా చెప్పి.. పాలిటిక్స్ లో ఏమవుతుందో మనం చెప్పలేం.. అదే నేను అప్పటి నుండి సినిమాలను కంటిన్యూ చేసుంటే దాని సీన్ వేరేలా ఉండేది. ఈరోజున నేను చేసిన తప్పునే నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండు కాని సినిమాలను మాత్రం వదలొద్దు అంటూ మరోసారి పవన్ కు విజ్ఞాపించారట మెగాస్టార్.

,  ,  ,  ,  ,