Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:32:38
facebook Twitter Googleplus
Photo

విశ్వనటుడు కమల్ హాసన్ చేసిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. వీటిలో విశ్వరూపం చిత్రానిది మరో ప్రత్యేకత. నటనలో ఎప్పటికప్పుడు తనకు తనే బెంచ్ మార్క్ లు సృష్టించే కమల్.. తనే స్వయంగా డైరెక్ట్ చేసి.. అంత వయసులోనూ స్టంట్స్ చేసి మెప్పించిన యాక్షన్ మూవీ విశ్వరూపం. అప్పట్లోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు కూడా.

విశ్వరూపం2 షూటింగ్ మొదలైపోవడం.. చాలాభాగం పూర్తి చేసుకోవడం వరకూ జరిగాక.. అర్ధాంతరంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. విశ్వరూపం2 ఎందుకు సడెన్ గా నిలిచిపోయిందో అసలు విషయం చెప్పేశారు కమల్. 'నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ డబ్బులతో నేను వాటిని టీం మెంబర్లకు చెల్లించాలి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఆరు నెలలు పడుతుంది. అదంతా జరగాలంటే టీంకి బకాయిలే కాదు.. పారితోషికం కూడా చెల్లించాల్సిందే' అన్నారు కమల్ హాసన్.

తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారట కమల్ హాసన్. అయితే టీం విషయంలో తాను చేయగలగింది ఏం లేదన్న ఆయన.. పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. అనుకున్నట్లుగా జరిగి విశ్వరూపం2 రిలీజ్ వరకూ వస్తే.. ఆడియో లాంఛింగ్ కార్యక్రమానికి హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ స్వాజ్ నెగ్గర్ ను పిలవాలన్నది కమల్ యోచన.

,  ,  ,  ,  ,