Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 10:38:27
facebook Twitter Googleplus
Photo

మామూలుగా ఇద్దరు అన్నదమ్ములు ఫోన్లో మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు కానీ.. మెగా బ్రదర్స్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటే మాత్రం అది వార్తే. గత కొన్నేళ్లలో వీళ్లిద్దరి మధ్య అలాంటి చిత్రమైన వాతావరణం ఏర్పడింది. పవన్ వెళ్లి చిరును కలిసినా.. పవన్ సినిమా వేడుకకు చిరు వచ్చినా.. ఒకరికొకరు ఫోన్ చేసుకున్నా వార్తే. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి బయటికి వచ్చింది. తాజాగా చిరు.. తన తమ్ముడికి ఫోన్ చేశాడట. అది క్యాజువల్ కాల్ కాదు. ?కాటమరాయుడు? టీజర్ విషయంలో అభినందనలు తెలపడానికే చిరు పవన్ కు ఫోన్ చేశాడట.

?కాటమరాయుడు? టీజర్ చాలా బాగుందని.. తనకెంతో నచ్చిందని చెప్పి పవన్ ను అభినందించాడట చిరు. సినిమా బాగా ఆడాలని కూడా చిరు ఆకాంక్షించాడట. అన్నయ్య ఫోన్ చేసి అభినందించడంపై పవన్ చాలా హ్యాపీగా ఫీలైనట్లు సన్నిహితులు చెప్పారు. మరోవైపు కాటమరాయుడు టీజర్ పై మెగా హీరోలు చాలామంది పాజిటివ్ గా ట్వీట్లు చేశారు. చిరు తనయుడు చరణ్ ఫేస్ బుక్ లో ఈ టీజర్ సూపర్బ్ అని స్పందించాడు. 30 సెకన్ల నిడివి ఉన్న కాటమరాయుడు టీజర్.. సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఈ టీజర్ కేవలం 2 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకుని ఖైదీ నెంబర్ 150 రికార్డును (3 గంటల్లో మిలియన్ వ్యూస్) బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 37 లక్షల వ్యూస్ పూర్తయ్యాయి కాటమరాయుడు టీజర్ కు.

,  ,  ,  ,  ,