Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2017 10:58:02
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి ఎంత సంయమనంతో వ్యవహరిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తోడబుట్టిన నాగబాబు.. పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశపరుల్లా కనిపిస్తారు కానీ.. చిరు మాత్రం సాఫ్ట్ గానే కనిపిస్తాడు. ఐతే యుక్త వయసులో ఆయనకు కోపం కొంచెం ఎక్కువే ఉండేదట. ఆ కోపంతో ఒకసారి నాగబాబును కొట్టడం కూడా జరిగిందట. ఈ విషయాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం సందర్భంగా చిరంజీవి ముందు కూర్చుని నాగబాబే స్వయంగా వెల్లడించాడు.

నాగబాబు మామూలుగా చాలా బద్దకిస్టు అట. చిరంజీవి మాత్రం చాలా చురుగ్గా ఉండేవాడట. ఇంట్లో పనులన్నీ కూడా చిరునే చక్కబెట్టేవాడట. ఏదైనా పని అప్పజెప్పినా నాగబాబు చేసేవాడు కాదట. నిద్ర పోతూ ఎక్కువ సమయం వృథా చేసేవాడట. ఐతే ఒకసారి చిరు.. లాండ్రీకి ఇచ్చిన బట్టలు తీసుకురమ్మని చెప్పి పని మీద బయటకు వెళ్లాడట. తిరిగి వచ్చేసరికి నాగబాబు నిద్ర పోతూ కనిపించాడట. దీంతో చిరుకు చిర్రెత్తుకొచ్చి నాలుగు తగిలించాడట. అంతలో చిరు తల్లి వచ్చి.. చిన్నోడిని ఎందుకురా కొడతావు అంటూ తిట్టిందట. దీంతో చిరుకు ఏడుపొచ్చి.. తండ్రి రాగానే విషయం చెప్పగా.. ఆయన మళ్లీ నాగబాబును వాయించాడట. అన్నదమ్ములిద్దరూ ఎంఈకే షోలో ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకుని నవ్వుకున్నారు.

,  ,  ,  ,  ,  ,