Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 11:06:56
facebook Twitter Googleplus
Photo

దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాణంలో ఒక సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించి దాదాపు రెండేళ్లవుతోంది. కానీ ఇప్పటిదాకా ఆ సినిమా ఊసే లేదు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా పవన్ సినిమా నిర్మిస్తానన్న ప్రకటన వచ్చి కూడా చాలా కాలమైంది. కానీ ఈ క్రేజీ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో తన మిత్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో.. తన అన్నయ్య చిరంజీవితో కలిసి పవన్ చేస్తాడంటున్న మల్టీస్టారర్ గురించి ఎంత వరకు ఆశలు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ కాంబినేషన్ జనాల్లో విపరీతమైన ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది కానీ.. అదే సమయంలో ఇది అంత నమ్మశక్యంగా కూడా అనిపించలేదు.

టి.సుబ్బిరామిరెడ్డి స్వయంగా ప్రకటన చేసినా సరే.. ఈ కాంబో జనాలకు అంత నమ్మకమైతే కలిగించలేదన్నది వాస్తవం. నిజంగా సినిమా మొదలయ్యాక చూసుకుందాంలే అన్న ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. పవన్ గత కొన్నేళ్లుగా తన అన్నయ్య విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. నిజంగా ఆయనతో సినిమా చేస్తాడా అన్నది సందేహమే. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పవన్ 2019 ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నాడు. మహా అయితే ఇంకో ఏడాదిన్నర పాటు మాత్రమే సినిమాల్లో కొనసాగేలా ఉన్నాడు. ఈ లోపు ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికే సమయం అయిపోతుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల కోసం తయారవ్వాల్సి ఉంటుంది. మరోవైపు చిరంజీవి ఆల్రెడీ రెండు ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ కమిట్మెంట్లు త్రివిక్రమ్ కు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు తెరమీదికి వస్తుందా అన్నదీ డౌటే. సుబ్బిరామిరెడ్డి ప్రకటన అయితే చేశాడు కానీ.. మిగతా వాళ్ల అవైలబిలిటీ చూసుకోవాలి. వాళ్లందరి నుంచి ఈ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చాక కానీ ఈ సినిమా ఖరారైనట్లు కాదు.

,  ,  ,  ,  ,  ,